ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సర్పంచ్ వార్డు సభ్యులు
గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపు
శింగనమల మండలం పెరవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. పెరవలి గ్రామ సర్పంచ్‌గా పుచ్చకాయల రాధా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో పాటు పంచాయతీ పరిధిలోని మొత్తం 10 వార్డుల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పుచ్చకాయల రాధా 10 మంది వార్డు సభ్యులతో కలిసి శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శ్రావణి శ్రీ పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వ సహకారంతో పెరవలి గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిదానంద నాయుడు పుచ్చకాయల రాము నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.