గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆవుల లక్ష్మి నూతన వార్డు సభ్యులు స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ సమష్టిగా కృషి చేసి మర్తాడు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆమె ఆకాంక్షించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
అనంతరం వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రచార తీరుపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని కలిసిన మర్తాడు నూతన సర్పంచ్



