డిసెంబర్ 9న హైదరాబాద్‌కు ఆదివాసుల భారీ తరలింపు!డిసెంబర్ 9న హైదరాబాద్‌కు ఆదివాసుల భారీ తరలింపు!
  • హక్కుల కోసం సమరశంఖం.. చలో హైదరాబాద్‌కు బాలన్నగూడెం ఆదివాసుల జైకొట్టు!
  • ఆదివాసీ అస్తిత్వం కోసం ఐక్య పోరు.. డిసెంబర్ 9 మహాసభకు మేము సైతం సిద్ధం!

ఆదివాసుల హక్కులు, చట్టాలు, జీవోల అమలు, ఆదివాసుల అస్తిత్వ పరిరక్షణ లక్ష్యంగా డిసెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బాలన్నగూడెం ఆదివాసులు మద్దతు ప్రకటించారు. మంగపేట మండలం బాలన్నగూడెంలో గ్రామ పెద్దల చేతుల మీదుగా చలో హైదరాబాద్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఆదివాసుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, డిసెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే మహాసభకు గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉద్యమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు నల్లెబోయిన లక్ష్మణ్ దొర, మండల అధ్యక్షులు కోరం మొగిలి, వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొమరం శివాజీ, ఉపాధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, తుడుందెబ్బ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *