యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి! యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి!
  • విద్యార్థులు, యువతకు విస్తృత అవగాహన కల్పించాలి
  • క్రీడా రంగంలో తెలంగాణ కీర్తి చాటాలి.. ఖేలో ఇండియా గేమ్స్‌పై విస్తృత ప్రచారం చేయాలి!
  • పతకాలే లక్ష్యంగా క్రీడాకారులు ముందుకు సాగాలి
  • గ్రామగ్రామాన ఖేలో ఇండియా సందడి.. విద్యార్థుల్లో క్రీడా చైతన్యం పెంచాలి!: — మంత్రి సీతక్క
  • తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనున్న ఎనిమిదవ జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను విజయవంతం చేయడంతో పాటు విద్యార్థులు, యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేలా జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అధికారిక పోస్టర్, లోగో, మస్కట్, సెల్ఫీ పాయింట్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులు పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని నిరంతర సాధనతో విజయాలు సాధించాలని సూచించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 20 వేదికలపై జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, గ్రామాలు, విద్యాసంస్థల్లో పోస్టర్లు, మస్కట్ కటౌట్లు, స్టాండీలు ఏర్పాటు చేసి ప్రజల్లో క్రీడా చైతన్యం తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా యువజన క్రీడల అధికారి ధర్మనాయక్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *