12వ వార్డుకు నామినేషన్ దాఖలు చేసిన గంట్ల గౌతంరెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మరిపెడ మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కోలహలంగా కొనసాగింది. మరిపెడ మున్సిపాలిటీలో 12వార్డు కౌన్సిలర్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా గంట్ల గౌతమ్ రెడ్డి, 13 వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థి వెర్మారెడ్డి నాగేంద్ర సుధాకర్ రెడ్డి, నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు,త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల నిర్వహణ, వీధి దీపాలు, చెత్త సేకరణ, పారిశుధ్యం వంటి పనులను,
ప్రజా మరుగుదొడ్లు,పట్టణ అభివృద్ధి, పరిశుభ్రత, ప్రజారోగ్యం పరిరక్షణ కోసం మా వార్డు మున్సిపాలిటీ ప్రజల సహకారంతో నన్ను భారీ మెజారిటీ తో గెలిపించాలి అని వారు కోరారు,మున్సిపాలిటి లోని మా వార్డు ను అభివృద్ధి పథంలో తీసుకుపోతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెర్మారెడ్డి ప్రవీణ్ రెడ్డి,సంతోష్ రెడ్డి,గుండగని నరేష్,షేక్ తాజుద్దీన్,దశరథ్,మహేష్ భరత్,వెంకన్న, ఎడెల్లి పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.