

ఈ69న్యూస్ వరంగల్, ఏప్రిల్ 26
వరంగల్ నగరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయాలు, వీధులు పూలతో, దీపాలతో అలంకరించి, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకుని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన వాసవీ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.వాసవీ మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున నిర్వహించే ఈ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ, ధర్మం, నీతి, సేవాభావం వంటి విలువలను మన జీవితాల్లో ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుద్దామని సూచించారు.ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మాతకు ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు.