పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మరిపెడ మండలం లోని ప్రజ్ఞ స్కూల్ లో ఘనంగా నిర్వహించరు,చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకచోట చేరి, పాత జ్ఞాపకాలను పంచుకుంటూ స్నేహబంధాలను,ఆనందోత్సాహాలతో ఆత్మీయంగా నిర్వహించుకునే ఒక కార్యక్రమమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ నమ్మేళనం అని తెలిపారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు జీవితంలో కొన్ని బంధాలు కాలంతో మారిపోతాయి, కానీ కొన్ని కాలాన్ని దాటి నిలిచిపోతాయి. విద్యాసంస్థతో, గురువులతో స్నేహితులతో,ఏర్పడిన బంధం అలాంటిదే. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, మనం తిరిగి ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకునే యాత్ర అని,ఇక్కడ విద్యను మాత్రమే కాదు, జీవన మార్గాన్ని, ధర్మాన్ని, సేవా భావాన్ని నేర్చుకున్నాం అని విద్యార్థులు సమాజానికి సేవా సంకల్పాన్ని అందిస్తుంది అని అన్నారు, పాఠశాల లో 2005-06 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాలలో శనివారం అత్మీయ సమ్మేళనం,ఆట,పాట పాటలతో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా వలకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు స్మరించుకుంటూ, వారు నేర్పిన విద్య బుద్దులు నేడు మేము ఈ స్థాయి లో ఉన్నాము అని స్మరించుకున్నారు, అనంతరం గురువులను సన్మానించారు. అలనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సాయంత్రం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. 20ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కలుసుకోవడంతో అలనాటి మధురానుభూతులను గుర్తుచేసుకున్నారు.20 సంవత్సరాల క్రితం వారికీ విద్యబుద్దులు నేర్పించిన ప్రజ్ఞ పాఠశాల వ్యవస్థాపకులు ప్రధానోపాధ్యాయులు మల్లు ఉపేందర్ రెడ్డి, కరస్పండెంట్ రమాదేవి, ఉపాధ్యాయులు రవికుమార్,అనంతరాములు,ఉప్పలయ్య,రవి,వెంకటేశ్వర్లు,యాదగిరి, దయానంద్ సార్లను సన్మానించుకున్నారు. విద్యార్థులు రాంపల్లి భరత్ బాబు, ప్రసాద్, నరేష్, రాజా వీరభద్రం, రాధాకృష్ణ, బాలు,నిర్మల, రజిత,జరీనా, మౌనిక, అమృత తదితరులు పాల్గొన్నారు.విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.