రైతులకు సమాచారం లేకుండా ఇరిగేషన్ శాఖ సభ
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికకు తూట్లు
•రైతులకు సమాచారం లేకుండా ఇరిగేషన్ శాఖ సభ
•33 గ్రామాల రైతులు గైర్హాజరు: ఏకైక సర్పంచ్‌తో ఇరిగేషన్ డీఈ రాజు ‘పేరుకే’ సమావేశం
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/మే 8
వరంగల్ జిల్లా:పర్వతగిరి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవంలో నిర్వహించాల్సిన ఇరిగేషన్ శాఖ మండల స్థాయి సమావేశం తూతూ మంత్రంగా జరిగింది.వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి మండల వ్యాప్తంగా 33 గ్రామాల రైతులు గైర్హాజరయ్యారు.ఆరుగురు ఆంజనేయ స్వాములతో సభ:
నీటిపారుదల,శాఖ,ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి 9 వరకు మండల వ్యాప్తంగా రైతులతో ప్రత్యేక సభలు నిర్వహించాలి.అయితే ఇరిగేషన్ అధికారులు 33 గ్రామాల సర్పంచ్‌లు,పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు, తూముల నిర్వహణ విఆర్ఎలకు సరైన సమాచారం ఇవ్వకుండా సభ నిర్వహించారు.”తక్కువ ధరకు జీలుగు విత్తనాలు ఇస్తున్నామని పిలిచి ఆరుగురు ఆంజనేయ స్వాములతో సభ నిర్వహించడం గమనార్హం”అని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ సభకు పర్వతగిరి ఏకైక సర్పంచ్ చీదురు శంకర్ మాత్రమే హాజరయ్యారు. మండల స్థాయి అధికారులు ఎవరూ హాజరుకాలేదు.డీఈ రాజుపై గతంలోనూ ఆరోపణలు
ఇరిగేషన్ డీఈ రాజుపై గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఉన్నాయని, అయినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని మండల రైతులు చర్చించుకుంటున్నారు.గత సంవత్సరం పర్వతగిరి మండలంలోని రిజర్వాయర్,పలు చెరువుల్లో చేపలు పట్టడానికి నీటిని వృథాగా వదిలిపెట్టినా అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
యువరైతు పోకల శంకర్ ఆగ్రహం:
“మండల వ్యాప్తంగా నిర్వహించాల్సిన నీటిపారుదల శాఖ సభకు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు.కొందరితో మాత్రమే సమావేశం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. సంబంధిత అధికారులపై ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి”అని యువరైతు పోకల శంకర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్, చల్లా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.