గ్రామ సర్పంచ్ మూడు జంపా నాయక్, ఉప సర్పంచ్ ఉమాదేవి
BREAKING NEWS
నారాయణ పురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
గ్రామ సర్పంచ్ మూడు జంపా నాయక్, ఉప సర్పంచ్ ఉమాదేవి
తెలుగు గళంన్యూస్ పర్వతగిరి/మే8
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం,పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన మూడు రవికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును గ్రామ సర్పంచ్ మూడు జంపా నాయక్, ఉప సర్పంచ్ ఉమ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమలత, పాలకవర్గ సభ్యులు సునీత,మంజుల,లక్ష్మి, ఏకాంతం శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మంపాటి సాయిలు,స్కైలాబ్ బాబు తదితరులు పాల్గొన్నారు.