మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ప్రతినిధి బృందం
భూపాలపల్లి డీఆర్వో వసంత కుమారికి ‘ట్రెస్సా’ ఘన స్వాగతం
మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ప్రతినిధి బృందం
పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షల వెల్లువ
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన రెవెన్యూ అధికారి (డీఆర్వో) గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి వసంత కుమారి ని సోమవారం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెస్సా) జిల్లా శాఖ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లా కలెక్టరేట్ లోని ఆమె కార్యాలయంలో ట్రెస్సా జిల్లా అధ్యక్షులు శ్రీ మార్క రామ్మోహన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నూతన డీఆర్వోకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ.. జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం బలోపేతానికి,ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నూతన డీఆర్వో మార్గనిర్దేశనంలో ఉద్యోగులందరూ సమన్వయంతో పని చేస్తామని తెలిపారు.రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ,జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు కోరారు.తమను కలవడానికి వచ్చిన ట్రెస్సా ప్రతినిధులకు డీఆర్వో వసంత కుమారి కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా పరిపాలనలో రెవెన్యూ విభాగం అత్యంత కీలకమని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రెస్సా జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ రజాక్, ట్రెజరర్ పకిడే రాజయ్య,అసోసియేషన్ ఇతర ముఖ్య నాయకులు,రెవెన్యూ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.