దరవత్ తండా మధ్య రోడ్డుపై ఆవును ఢీ
BREAKING NEWS
మరిపెడ మండలంలో ఆర్టీసీ డ్రైవర్‌కు రోడ్డు ప్రమాదం
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ భూక్య శ్రీను (39) శనివారం విధులకు హాజరుకావడానికి ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. మరిపెడ మండలంలోని గాలివారిగూడెం–దరవత్ తండా మధ్య రోడ్డుపై ఆవును ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో శ్రీను కుడి చెవి నుంచి రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. మరిపెడ 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు.ఈ సేవల్లో ఈఎంటీ అనుముల రామన్న , పైలట్ బాల మధు పాల్గొన్నారు.