కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి మహిళ మృతి
కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన పర్వతగిరి మండలం చింత నెక్కొండ లో చోటుచేసుకుంది. చింతనెక్కొండకు చెందిన ఆటో డ్రైవర్ కుంట సతీష్ (38) ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.తన తల్లి కుంట నాగలక్ష్మి (57) గత 8 నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గలేదు.ఈ క్రమంలో మే 21న కుటుంబ సభ్యులంతా పొలం పనులకు వెళ్లారు.ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగలక్ష్మి కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మే 22న ఉదయం 7:20 గంటలకు నాగలక్ష్మి మృతి చెందింది.
మృతురాలి కొడుకు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.