సత్తుపల్లి ‘విజనరీ కోచింగ్ సెంటర్’ చారిత్రాత్మక రికార్డు
తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (POLYCET) ఫలితాల్లో 120/120 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన విజనరీ కోచింగ్ సెంటర్ విద్యార్థి మహమ్మద్ అర్రఫాజ్ అలీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని గoడుగులపల్లిలోని తన నివాసంలో ఘనంగా సత్కరించారు.
విజనరీ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి గారు విద్యార్థికి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ విద్యా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక విద్యార్థికి రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ ర్యాంక్ రావడం, ఆ అద్భుతాన్ని విజనరీ కోచింగ్ సెంటర్ సాకారం చేయడం పట్ల మంత్రి వర్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
“రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచి మన ప్రాంతానికి అఖండ కీర్తి తెచ్చిన విద్యార్థి మహమ్మద్ అర్రఫాజ్ అలీకి నా అభినందనలు. కేవలం నగరాలకే పరిమితం అనుకునే స్టేట్ ఫస్ట్ ర్యాంకును సత్తుపల్లి ప్రాంతంలో సాధ్యం చేసి చూపించిన విజనరీ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ మరియు అధ్యాపక బృందం అభినందనీయులు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తూ ‘విజనరీ’ సంస్థ విద్యా ప్రమాణాల్లో అగ్రస్థానంలో నిలిచింది.”
స్టేట్ టాపర్ మహమ్మద్ అర్రఫాజ్ అలీ మాట్లాడుతూ:
“నా ఈ చారిత్రాత్మక విజయానికి విజనరీ కోచింగ్ సెంటర్ అందించిన అద్భుతమైన శిక్షణ, ప్రత్యేక ప్రణాళికే ప్రధాన కారణం. అధ్యాపకులు ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పడం వల్లే నేను 120 కి 120 మార్కులు సాధించగలిగాను. నన్ను ప్రతిక్షణం ప్రోత్సహించిన మా విజనరీ డైరెక్టర్లకు, నా తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు.”
విజనరీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు మాట్లాడుతూ:
“సత్తుపల్లి ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా మా విజనరీ కోచింగ్ సెంటర్ విద్యార్థికి రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ రావడం మా సంస్థకు లభించిన అత్యున్నత గౌరవం. మా నమ్మకాన్ని నిలబెట్టి, రికార్డు స్థాయి మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహమ్మద్ అర్రఫాజ్ అలీ మా విజనరీ గర్వకారణం. భష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో మరిన్ని సంచలన విజయాలు సాధిస్తాం అని రాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, కొత్తూరు ప్రభాకర్ రావు, విజనరీ కోచింగ్ డైరెక్టర్లు జొన్నలగడ్డ రాజు, కంచపోగు గోపాలరావు, ఖమ్మంపాటి రామకృష్ణ, స్టాప్ షేక్ కరిముల్లా విశ్వశాంతి స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరావు, ఎన్సిసి రాష్ట్ర అధ్యక్షులు అలవాల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.