
ఈ69 న్యూస్ వరంగల్, మే 25
అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వరంగల్ జిల్లా ప్రతినిధుల బృందం సోమవారం స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఏసీపీ ఎం. జితేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కమ్యూనిటీ ప్రతినిధులు తమ సంస్థ లక్ష్యాలను, సేవా కార్యక్రమాలను ఏసీపీకి వివరించారు.అనంతరం అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ అంతర్జాతీయ అధినేత మిర్జా మస్రూర్ రచించిన ‘ప్రపంచ సంక్షోభం మరియు శాంతి మార్గం’ అనే గ్రంథాన్ని ఆయనకు బహూకరించారు.
“దుష్ప్రచారంపై సీపీకి ఫిర్యాదు”
ఈ సందర్భంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్ యాకూబ్ పాషా మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా తమ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ‘ఖత్మే నబువ్వత్’ అనే సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తున్న సదరు సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్‌ప్రీత్ సింగ్‌కు ఇప్పటికే రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.సీపీకి సమర్పించిన ఫిర్యాదు పత్రాల ప్రతిని (కాపీ) ఈ సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డికి ప్రతినిధుల బృందం అందజేసింది. తమ కమ్యూనిటీ భద్రతను, హక్కులను కాపాడాలని వారు కోరారు.
“పూర్తి విచారణ జరుపుతాం-ఏసీపీ జితేందర్ రెడ్డి”
అహ్మదీయ ప్రతినిధుల నుంచి ఫిర్యాదు పత్రాలను స్వీకరించిన స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎం. జితేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ వ్యవహారంపై త్వరలోనే పూర్తిస్థాయి విచారణ చేపట్టి, నివేదికను గౌరవనీయ పోలీస్ కమిషనర్‌కు సమర్పిస్తామని ఆయన ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన జిల్లా ఉపాధ్యక్షుడు ముహమ్మద్ సలీం,పట్టణ మిషనరీ ఇంచార్జీ మౌల్వీ అయాన్ పాషా,పలువురు ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.