మెడికవర్ ఆసుపత్రిలో ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 5
వరంగల్ హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆసుపత్రిలో ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరెడ్ల సూరయ్య ని శుక్రవారం రోజు మాజీ జడ్పీటీసీ,సీనియర్ రాజకీయ వేత్త మేడిశెట్టి రాములు పరామర్శించారు.ఈ సందర్భంగా మేడిశెట్టి రాములు నరెడ్ల సూరయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని,వైద్యుల సలహాలు పాటిస్తూ సరైన చికిత్స తీసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కుటుంబ సభ్యులకు.ధైర్యంగా ఉండాలని తెలిపారు.