దశదిన కర్మకు హాజరైన మాజీ టెస్కాబ్ చైర్మన్
హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బొల్లపెల్లి సురేష్, రాజేష్ తండ్రి బొల్లపెల్లి వెంకట నారాయణ దశదిన కర్మ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వెంకట నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు, గ్రామ ఉప సర్పంచ్ బరిగెల భాస్కర్, వాకిటి చందర్ రెడ్డి, కొత్తూరి సునీల్, సంపత్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, రాజు సతీష్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.