ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందజేత
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
ఈరోజు మరిపెడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ,కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొని,అర్హులైన లబ్ధిదారులకు కార్డులను అందజేసిన డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందాలనే లక్ష్యంతో 59 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 5 షాదీముబారక్ చెక్కులు,నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చెయ్యడం జరుగుతుందన్నారు,సంక్షేమ పథకాలు అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందన్నారు,ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు,కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షపాతిగా నిలుస్తుందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు,ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత సన్నబియ్యం,మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి,రైతు రుణమాఫీ,రైతు భరోసా, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలను ఆయన వివరించారు,రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు,గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని,ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదల కల సాకారం చేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి,పెండ్లి రఘువీర్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మరిపెడ టౌన్ అధ్యక్షులు పానుగోతు రామ్ లాల్,వైస్ చైర్ పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, మరిపెడ మండల పార్టీ అధ్యక్షులు గుగులోతు రవి నాయక్, కెసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు,కొంపెల్లి సురేందర్ రెడ్డి,స్థానిక అధికారులు స్థానిక తహసీల్దార్ కృష్ణవేణి,ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,కమిషనర్ నరేష్ రెడ్డి,కౌన్సిలర్లు
జాటోత్ సురేష్,మెరుగు రాము,గంట్ల గౌతమ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, అజీజ్,షేక్ తాజోద్దీన్,షేక్ ఆఫ్జల్,గంధసిరి బిక్షపతి,విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
