- ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం.. యువత భాగస్వామ్యంతో ముందుకు
తెలుగు గళం మంగపేట, సెప్టెంబర్ 28:
ములుగు జిల్లా మంగపేట మండల భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) మండల అధ్యక్షుడిగా మూతి రవి నియమితులయ్యారు. ములుగు జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేవైఎం అధ్యక్షులు మాదరి శ్రీకాంత్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నూతన అధ్యక్షులు యువతను పార్టీతో అనుసంధానం చేస్తూ, మండలంలో బీజేవైఎంను బలోపేతం చేయాలని సూచించారు. మూతి రవి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరికొండ బలరాం, జిల్లా బీజేవైఎం అధ్యక్షులు మాదరి శ్రీకాంత్, మంగపేట మండల బీజేపీ అధ్యక్షులు రావుల జానకిరావుతో పాటు మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు యువతను చైతన్యపరిచి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
