- రూ.10 లక్షలతో గ్రామ సమైక్య భవనం ప్రారంభించిన మంత్రి సీతక్క
- సౌర విద్యుత్‌తో పేద కుటుంబాలకు ప్రయోజనం
తెలుగు గళం ములుగు, సెప్టెంబర్ 28:
ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద రెండు గృహాలపై ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ మహదేవరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ పథకం 2026–27 నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన శ్రీ సీతారాముల గ్రామ సమైక్య భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడంతో పాటు మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ బిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, అదనపు పీడీ శ్రీనివాస్, డీపీఎం, ఏపీఎం, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
