గిరిజనులకు నాణ్యమైన సేవలు అందించాలి: పీఓ లెనిన్ వత్సల్ టోప్పోగిరిజనులకు నాణ్యమైన సేవలు అందించాలి: పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
  • అంగన్‌వాడీ, ఆరోగ్య ఉపకేంద్రంలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీలు
  • గిరిజనులకు నాణ్యమైన సేవలు అందించాలి: పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

తెలుగు గళం ఏటూరునాగారం, అక్టోబర్ 9:

గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల సంక్షేమం, పౌష్టికాహారం, ప్రజారోగ్య సేవల మెరుగుదలకు ఐటీడీఏ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం చిన్నబోయినపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదట అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన పీఓ, చిన్నారులకు అందిస్తున్న సేవలు, పౌష్టికాహారం, అందుబాటులో ఉన్న వసతులు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, పరిశుభ్రమైన వాతావరణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి వైద్య రికార్డులు, మందుల నిల్వలు, వైద్య పరికరాలు, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలను సమీక్షించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందించాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ఆరోగ్య రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరడంతో పాటు విద్య, పోషణ, వైద్య సేవలు సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పీఓ సూచించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *