పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్వు రజిన్ కుమార్పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్వు రజిన్ కుమార్

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
స్థానిక వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్వు రజిన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు మరియు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు.అనంతరం విద్యార్థినులు,ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది,సంప్రదాయ పాటలు పాడుతూ ఆడిపాడారు.దీంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్,రాజు,తాజోద్దీన్,రవీందర్,చంద్రమౌళి,దేవేందర్,సుమన్,ఓంకార్,స్వప్న,ఆస్ఫియా,అశ్విని,షహీద,కరుణశ్రీ,సుమలత,రమ్య,మున్ని తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *