ప్రతి ఆడబిడ్డ జీవితంలో కొత్త వెలుగులు నిండాలి: మంత్రి సీతక్కప్రతి ఆడబిడ్డ జీవితంలో కొత్త వెలుగులు నిండాలి: మంత్రి సీతక్క
  • తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక..
  • ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం
  • ప్రతి ఇంటా ఆనందం.. ప్రతి ఆడబిడ్డ జీవితంలో కొత్త వెలుగులు నిండాలి: మంత్రి సీతక్క

తెలుగు గళం ములుగు, అక్టోబర్ 09:

తెలంగాణ ఆడబిడ్డలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు. కులమతాలకు, పేదధనిక తేడాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఆత్మగౌరవంతో జీవించాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రకృతితో ముడిపడిన బతుకమ్మ పండుగ స్ఫూర్తితో చెరువులు, పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి ఆడబిడ్డ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *