వేలేరు (ఈ69న్యూస్) అక్టోబర్ 11:

వేలేరు మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని వేలేరు గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనివాస్, సురేష్, శ్రీనివాస్, భరత్, కిరణ్, మహేష్, వేద పండితులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.