అంబేద్కర్ ఫెలోషిప్ రాష్ట్ర అవార్డు గ్రహీత జంగిలి బాబు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతం గౌడ్ నివాళులు
అంబేద్కర్ ఫెలోషిప్ రాష్ట్ర అవార్డు గ్రహీత జంగిలి బాబు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతం గౌడ్ నివాళులు*
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 2
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ ఫెలోషిప్ రాష్ట్ర అవార్డు గ్రహీత జంగిలి బాబు, పర్వతగిరి మండల ఉద్యమకారుడు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతం గౌడ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండల ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జంగిలి బాబు మాట్లాడుతూ,భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యానికి దోహదపడతాయని పొందుపరిచారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.60 ఏళ్ల నిరీక్షణ తర్వాత, సుమారు 1200 మంది అమరుల త్యాగఫలంగా తెలంగాణ సిద్ధించింది.అని అన్నారు.
తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు సభ్యుల మద్దతు కూడగట్టడంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక పాత్ర పోషించారు. అప్పటి స్పీకర్ మీరాకుమారి,కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే-ఇద్దరూ అంబేద్కర్ వారసులే. అంబేద్కర్ కలలు కన్న చిన్న రాష్ట్రం ఏర్పాటులో వారి సేవలు చిరస్మరణీయం అని పేర్కొన్నారు.
మాజీ ఏఎంసీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఉద్యమబాట పట్టారు. అన్ని వర్గాలను కలుపుకొని చేసిన పోరాట ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు.ఉత్తిగ రాలేదు తెలంగాణ. కర్షకుడి చెమట చుక్క నుంచి, వృద్ధుడి చివరి శ్వాస వరకు ‘ప్రత్యేక రాష్ట్రమే మా హక్కు’ అని గర్జించిన కోట్లాది ప్రజల త్యాగాల ఫలితం. విద్యార్థుల ఆత్మత్యాగాలు, ఉద్యోగుల సమ్మెలు, రైతుల కన్నీళ్లు, అమరవీరుల రక్తంతో నిర్మితమైన ప్రజా రాష్ట్రం ఇది. తెలంగాణ అంటే భౌగోళిక సరిహద్దు కాదు-అది పోరాటానికి ప్రతీక, ఆత్మగౌరవానికి చిరునామా అని ఉద్వేగంగా ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో రైతుబంధు మాజీ మండల అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్, బొట్ల వీరస్వామి,జీడి గట్టయ్య,పిట్టల రాజు, బొట్ల వెంకన్న, చిన్నపాక శ్రీకాంత్, పసుల శ్రీనివాస్, మునిగ కుమారస్వామి, దాసరి రాజు, యాసరపు సురేష్, యాదల్ల సదయ్య, బోశెట్టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.