ఆత్మకూరులో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డిల ఆదేశానుసారం.. ఆత్మకూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సెంటర్లో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్‌ను కట్ చేసి, ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరయ్యారు.
ఈ వేడుకల్లో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు కమలాపురం రమేష్, రేవూరి రణధీర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రజనీకార్, దామెర మండల పార్టీ అధ్యక్షులు దుబాసి రాజేందర్, రెండు మండలాల సమన్వయ కమిటీ సభ్యులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మండల ప్రజాప్రతినిధులు, బూత్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు