ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్
మండలంలోని ఏనుగల్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా స్వయంగా గ్రామంలోని బోయినికుంటలో మట్టి తవ్వే పనుల్లో పాల్గొని గడ్డపారతో మట్టి తవ్వి తోటి కూలిలకు అందించారు తాను సైతం మట్టిని తట్టతో తీసుకొని వెళ్లి పక్కన పోశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తనకు జాబు కార్డు ఉందని ప్రజాప్రతినిధి అయినా ఉపాధి హామీ కూలి పనులు చేస్తున్నాను అన్నారు తదనంతరం ఉపాధి హామీ చేస్తున్న కూలీల పని వేళలు తెలుసుకొని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకోవాలని ఓఆర్ఎస్ మజ్జిగ వైద్య సూచనలు పాటించాలని తెలిపినారు