
ఎగువ కులాల వారిని సామాజిక బహిష్కరణ చేయండి
పాలకుర్తి మండల కేంద్రానికి కూతవేటు దూరములో 12 సంవత్సరాల బాలికపై దొంగతన నేరం మోపి ఎగువ కులానికి చెందినవారు బహుజన కులానికి చెందిన సామాన్య బాలికను చెట్టుకు కట్టేసి కారంపొడి మానసికంగా నేరం ఒప్పుకోమని హింసించడం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే పోలీసులు స్థానిక ఎమ్మెల్యే మంత్రి కుమ్మక్కై దాడి చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి బహుజన బాలికపై ఇంతటి పైశాచిక దాడికి పాల్పడిన వారిని సామాజిక బహిష్కరణ చేయాలని నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు ఈరోజు పాలకుర్తిలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ నిజంగా అనుమానం ఉంటే చట్టం ఉన్నది కోర్టులు ఉన్నాయి న్యాయాన్ని తేల్చడానికి కానీ ఎగువ కులం అనే అహంకారంతో దిగువకుల మహిళను 12 సంవత్సరాల బాలికని చూడకుండా హింసించడం నేరా రోపణ చేయడం సభ్య సమాజం తలదించుకునే చర్య వెంటనే జిల్లా మంత్రి స్పందించి తన సామాజిక వర్గం అనే నెపాన్ని మోయకుండా న్యాయంగా బాలికకు వారి కుటుంబానికి అండగా నిలవాలని జ్యోతి డిమాండ్ చేశారు ఇప్పటికే పలు విప్లవ పార్టీలు దళిత బహుజన సంఘాలు న్యాయం జరగాలని ఉద్యమించడం జరిగినది ఫలితంగా పోలీసుల్లో కొంత కదలిక వచ్చినప్పటికీ బాలికపై కూడా కేసు పెడదామనడం ఇది పోలీసు వ్యవస్థ సవర్ణులు కు లొంగిపోవడమేనని ధ్వజమెత్తారు బాలిక కుటుంబానికి పరువు నష్టం కింద 25 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మానసికంగా కృంగిపోయి బాలిక ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యులు నేరారోపణ చేసిన వారు పోలీసులే కారణమవుతారని హెచ్చరించారు సంఘటన జరిగి 21 రోజులు అవుతున్నప్పటికీ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వము రక్షణ వ్యవస్థను ప్రజలు విశ్వాసం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు ఏ రకంగా అయితే నేరారోపణ చేసిన వాళ్లు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారో అదే రకంగా ప్రజలు విప్లవ ప్రజాస్వానికి శక్తులు చట్టాన్ని అధిగమించే పరిస్థితి రాకుండా చూడవలసిన బాధ్యత రక్షణ వ్యవస్థపై ఉందన్నారు ఈ సమావేశంలో రాస మల్ల దీన NFIW రాష్ట్ర సమితి సభ్యురాలు. రాస మల్ల దీన, ఈగ లావణ్య,. g. రేణుక ఉన్నారు.