కల్తీ లేని ఆహారం వినియోగదారులకు అందుబాటులో ఉండేటట్లు చూడాలి
కల్తీ లేని ఆహారం వినియోగదారులకు అందుబాటులో ఉండేటట్లు చూడాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగ దారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా పల్లెపాడు దామోదర్ పౌరసరఫరా ల కమీషనర్ అనిల్ కుమార్ ను మంగళ వారం హైదరాబాద్ సోమాజిగూడ లోని పౌరసరఫరాల భవన్ లో కలిసి కోరారు. అలాగే నారాయణ గూ డా లోని ఆహార కల్తీ నిరోధక శాఖ తెలంగాణా కా ర్యాలయంలో డైరెక్టర్ యన్. శివలీల డిప్యూటీ కంట్రోలర్ ఎ.విజయ కుమార్ లను సి.సి.ఐ జాతీ య కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రీతి పాండ్య, జాతీ య ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, సీని యర్ సంయుక్త కార్యదర్శి అన్నాప్రగడ శివ పార్వ తి లు తెలంగాణా రాష్ట్రంలోని వివిధ వినియోగదా రుల సమస్యలను కమీషనర్, డైరెక్టర్ ల దృష్టికి తెచ్చారు. జాతీయ పోషకాహార మాసం ( సెప్టెంబర్ ) సందర్భంగా వినియోగదారుల జాతీయ కమిటీ తెలంగాణ రాష్ట్రం లో చైతన్య కార్యక్రమాలతో పాటు ఆహార కల్తీ ని అరికట్టి, సంపూర్ణ పోషకాహా రం అందించాలని వినియోగదారుల ప్రతినిధులు విన్నవించారు. ఫోర్టిఫైడ్ రైస్ ఆవశ్యకత ను విని యోగదారులకు వివరించడం తో పాటు రైస్ మిల్ల ర్లు ఫోర్టిఫైడ్ రైస్ తయారీ, పాకింగ్ పై తప్పనిసరి గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ను పాటించాల్సిన అవసరం ఉందని విన్నవించా రు. పౌరసరఫరాల శాఖ, ఆహార కల్తీ నిరోధక శాఖ లు సంయుక్తంగా నాణ్యమైన ఆహారాన్ని ఫోర్టిఫైడ్ రైస్ ద్వారా వినియోగదారులకు అందించడం వల్ల జాతీయ పోషకాహార మాసం ఉద్దేశ్యం నెరవేరు తుందని ఉన్నతాధికారులకు వివరించడం జరిగిం ది. వివిధ వినియోగదారుల సమస్యలను శ్రద్ధగా విన్న అధికారులు వినియోగదారుల చైతన్యానికి కృషి వినియోగదారుల సంఘాలకు సంపూర్ణ సహ కారం అందిస్తామని చెప్పారు. ఫోర్టిఫైడ్ రైస్ ను తె లంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామని తెలి పారు. ఆన్ లైన్ లో ఆహార పదార్థాలు వాడకం లో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అనంతరం “ఆహార కల్తీ నివారణ వినియోగదారుల చైతన్యం” పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఇంకా నేటి కార్య క్రమం లో వినియోగదారుల వ్యవహారాల డిప్యూ టీ కమిషనర్ సి.పద్మ, అసిస్టెంట్ కమిషనర్ షేక్ నసీరుద్దీన్ లు పాల్గొన్నారు.