గ్రామంలోనే రేషన్ బియ్యం పంపిణీ
సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేలేరు గ్రామపంచాయతీ పరిధిలోని ఆవాస ప్రాంతమైన ఉప్పరపల్లె గ్రామ ప్రజలకు గ్రామంలోనే రేషన్ బియ్యం అందించే కార్యక్రమాన్ని సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉప్పరపల్లె ప్రజలు రేషన్ బియ్యం కోసం వేలేరు గ్రామానికి వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ వెంటనే స్పందించి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో గ్రామంలోనే రేషన్ బియ్యం పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉప్పరపల్లె గ్రామ ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉప్పరపల్లె ప్రజలకు ఆసరా పింఛన్లు మరియు రేషన్ బియ్యం గ్రామంలోనే అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు.ఇక రానున్న రోజుల్లో ఉప్పరపల్లె గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, సీసీ రహదారులు, కాలువల నిర్మాణ పనులు కూడా చేపడతామని సర్పంచ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కృపా సాగర్, లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు రాజయ్య, చంద్రమౌగిళి, రాజయ్యతో పాటు ఉప్పరపల్లె గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.