తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నగేష్ ముదిరాజ్
తెలుగు గళం న్యూస్ హైదరాబాద్ జూన్ 02
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి, చావు అంచుల వరకు వెళ్లి పోరాడిన మహనీయుడు కేసీఆర్ అని, అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నగేష్ ముదిరాజ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణలో విద్యా వికాసం, విజ్ఞాన ప్రగతి, సాగునీటి సమృద్ధి, వ్యవసాయాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణతో సర్వతోముఖ అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం రాష్ట్రం ఆంధ్ర పాలకుల కనుసన్నల్లో చిక్కుకుందని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత సూచనల మేరకు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడుతోందని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల ఆశయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని నగేష్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.