140 వ మే డే ను విజయవంతం చేయాలని పోస్టర్స్ ఆవిష్కరణ
- 140 వ మే డే ను విజయవంతం చేయాలని పోస్టర్స్ ఆవిష్కరణ
- టి యు సి ఐ జిల్లా కోశాధికారి అమర్లపూడి శరత్
సత్తుపల్లి, ఆర్ సి,ఏప్రియల్ 27 (తెలుగుగళం) న్యూస్:
అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇజ్రాయిల్ తో జతకట్టి ఇరాన్ పై అన్యాయంగా యుద్ధం చేస్తుందని పశ్చిమాసియా దేశాలలోని ఆయిల్ సంపదపైన రిఫైనరీల పైన ఖనిజ వనరుల పైన ఆధిపత్యం కోసం ఆయుధ పరిశ్రమల లాభాల కోసం యుద్ధాన్ని చేపట్టి అనేక పరిశ్రమల మూసివేతకు విధ్వంసానికి కారణమైందని దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) జిల్లా కోశాధికారి అమర్లపూడి శరత్ కార్మికులకు పిలుపునిచ్చారు.140 వ మే డే సందర్భంగా ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సామ్రాజ్యవాద దేశాలకు సంక్షోభాన్ని ప్రపంచ దేశాల మీదకి మళ్లించటం అంటే ఇదేనేమోనని యుద్ధానికి కాలు దువ్వి ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం దురాక్రమణ యుద్ధభారాలను యుధ్ధోన్మాద చర్యలను కార్మిక వర్గం ఖండించాలని దీనికి తోడ్పాటు ఇస్తున్న దేశాల లొంగుబాటు వైఖర్లను వ్యతిరేకించాలని, మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపించి గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ నిత్యవసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి కార్మిక వర్గంపై పెనుభారాన్ని మోపుతున్నదని అన్నారు. భారత దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నదని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందని పని గంటల పెంపు సమ్మె హక్కును కాలరాస్తూ అతి తక్కువ వేతనాలతో కార్మిక వర్గంతో పనిచేయిస్తూ భారతదేశ కార్మిక వర్గాన్ని మరింత శ్రమ దోపిడీ చేయడానికి లేబర్ కోడ్ల ద్వారా మార్పు చేపట్టిందని అన్నారు. 140 వ మేడేను పురస్కరించుకొని భారత కార్మిక వర్గం తెలంగాణ రాష్ట్రంలోని యుద్ధ భారాలను ఆపాలని ఉద్యోగాలలో కోత విధిస్తూ ధరలను విపరీతంగా పెంచుతూ కార్మిక వర్గ బతుకులను అతలాకుతలం చేస్తూ కుటుంబాల సంక్షోభానికి నడుస్తున్న పరిస్థితులపైపోరాడాలనిపిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవి, పి వెంకటేష్, సిహెచ్ వెంకటేష్ ఎస్.కె బాజీ, నాగేంద్ర, సతీష్, రామకృష్ణ, రాంబాబు, మారేష్ తదితరులు పాల్గొన్నారు.