కొత్తపల్లిగోరి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎన్యూమరేటర్లు,సూపర్వైజర్లకు శిక్షణ
:మండల ఛార్జ్ ఆఫీసర్ హేమలత
కొత్తపల్లిగోరి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎన్యూమరేటర్లు,సూపర్వైజర్లకు శిక్షణ
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లిగోరి
దేశ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు జనగణనపైనే ఆధారపడి ఉంటాయని,అందుకే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు అత్యంత నిబద్ధతతో సర్వే నిర్వహించాలని మండల ఛార్జ్ ఆఫీసర్ హేమలత పిలుపునిచ్చారు.సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లకు మూడవ దశ జనగణన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు సాగే ఈ శిక్షణా శిబిరంలో ఇండ్ల జాబితా తయారీ, ఇండ్ల గణన ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో వివరాల సేకరణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో వివరించారు.మండల విద్యాధికారి రాజు మాట్లాడుతూ.. జనాభా లెక్కల సేకరణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్ కల్పనా కుమారి, టెక్నికల్ అసిస్టెంట్ రఘు, ప్రవీణ్ కుమార్ లు శిక్షణ ఇచ్చారు. ఈ శిబిరంలో సీనియర్ అసిస్టెంట్ జోష్న, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు,సూపర్వైజర్లు,ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.