సిఐటియు జిల్లా అధ్యక్షులు కందునూరి శ్రీనివాస్
తెలుగు గళం న్యూస్, గార్ల / ఏప్రిల్ 28, మహబూబాబాద్ జిల్లా : మేడే దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో జరిగే మేడే దినోత్సవ ర్యాలీలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మేడే ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కందునూరి శ్రీనివాస్ కోరారు. మేడే ఉత్సవాల సన్నాహాక సభలలో భాగంగా భవన నిర్మాణ కార్మికుల అడ్డ వద్ద సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు, పోరాటాలను స్మరించుకుంటు జరిగే మేడే ఉత్సవలలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో భవన నిర్మాణ కార్మికుల యూనియన్ నాయకులు జడ శ్రీను, షేక్ మౌలానా,తాళ్లూరి రవీందర్, బడుగుల వెంకన్న, సత్యం మేస్త్రి,లల్లూ మేస్త్రి, సుతారి మేస్త్రి లు, సుతారి కూలీ కార్మికులు పాల్గొన్నారు