ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్
ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్
తెలుగు గళం న్యూస్ నర్సంపేట జూన్ 2
నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని
మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి నర్సంపేట పట్టణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నందు ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి,వారందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రస్తుత అకాడమిక్ ఇయర్ సంబంధించిన మొదటి అడ్మిషన్ దరఖాస్తును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేంద్ గుప్తా,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,మున్సిపల్ కౌన్సిలర్స్ మాదాసి రవి,ముత్తినేని వెంకన్న,ఎలకంటి విజయ్ కుమార్,హనుమకొండ శ్రీధర్,అయూబ్ ఖాన్,వేముల సంధ్యారాణి సాంబయ్య గౌడ్,కొత్తకొండ మేఘన శ్యామ్ రాజ్,బాణాల ప్రసన్న శ్రీనివాస్,శ్రీరామోజు రోజా రాణి,పొన్నాల మనీషా ప్రకాష్,చీకటి స్వరూప ఓదేలు,వేల్పుల శ్రీలత,ఇస్లావత రమా,మున్సిపల్ ఏఈ శానిటైజేషన్ ఇన్స్పెక్టర్,మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు