


ఈ69న్యూస్ హనుమకొండ, ఏప్రిల్ 06:
నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని 29వ డివిజన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో సయ్యద్ సలీం పాషా ను హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఇప్ప శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు బండి చక్రపాణి, భద్రకాళి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఓరుగంటి పూర్ణ, జిల్లా కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు సుతారి కళ్యాణి, డివిజన్ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ అలీమ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఇప్ప శ్రీకాంత్ మాట్లాడుతూ, సయ్యద్ సలీం పాషా గత కొంతకాలంగా దివ్యాంగులు మరియు మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా “స్ట్రీట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్” కార్యక్రమం ద్వారా డివిజన్లలోని పలు సమస్యలను పరిష్కరించడంలో విశేషంగా సేవలందిస్తున్నారని తెలిపారు. వారి సేవలను గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు వెల్లడించారు.అనంతరం సయ్యద్ సలీం పాషా మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ కు, జిల్లా అధ్యక్షులు ఇప్ప శ్రీకాంత్ కు, అలాగే బండి చక్రపాణి కు కృతజ్ఞతలు తెలిపారు.తన పదవిని నిబద్ధతతో నిర్వహిస్తూ, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సంస్థ నియమ నిబంధనలకు లోబడి అవినీతి రహితంగా సేవలు అందిస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మరియు డివిజన్ స్థాయి దివ్యాంగ నాయకులు పాల్గొన్నారు.