8 గంటలకు వేసవి క్రీడల శిక్షణ శిబిరం ఘనంగా ప్రారంభమైంది.
పీఎం శ్రీ కూనూరు ఉన్నత పాఠశాలలో వేసవి క్రీడల శిక్షణ శిబిరం ప్రారంభం
తెలుగు గళం న్యూస్ జఫర్ఘడ్ మే11
జఫర్గడ్ మండలం కూనూరు గ్రామంలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో సోమవారం (మే 11, 2026) ఉదయం 8 గంటలకు వేసవి క్రీడల శిక్షణ శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి కాటం దేవేంద్ర మల్లారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో క్రీడల్లో పాల్గొని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ పర్వాజ్ మాట్లాడుతూ, జనగామ జిల్లాలో 13 పీఎం శ్రీ పాఠశాలలు ఉండగా, జఫర్గడ్ మండలంలో కూనూరు పాఠశాల ఒక్కటే ఉందని తెలిపారు.విద్యార్థులకు వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, షూటింగ్ బాల్, కబడ్డీ, క్యారమ్స్, చెస్‌తో పాటు కంప్యూటర్ బేసిక్స్, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, ఫోక్ సాంగ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి విభిన్న అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు ప్రతిరోజూ అల్పాహారం కూడా అందజేస్తున్నట్లు వివరించారు.శిక్షణ కోసం చందా సాంబరాజు, విజయ్ కుమార్, ముచ్చ సుధాకర్ రెడ్డి, నరేష్‌లను ఇన్స్ట్రక్టర్లుగా నియమించగా, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్ పర్యవేక్షణ చేస్తున్నారు.ఈ సందర్భంగా 24 న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ జావిద్ క్రీడాకారులకు రూ.3000 విలువైన వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ బంతులను అందజేశారు. దీనికి ప్రధానోపాధ్యాయులు పర్వాజ్, పీఈటీ సాయికుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల మాజీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎల్లాచారి, గ్రామ క్రీడాకారుడు చేగొండ రమేష్, స్వచ్ఛంద కార్యకర్త పల్లె రాజిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిబిరం మొదటి రోజున 30 మంది క్రీడా విద్యార్థులు హాజరైనట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.