1994 ప్రకారం ఒక స్కాన్ సెంటర్ నమోదు ధృవపత్రాన్ని తాత్కాలికంగా సస్పెండ్
తెలుగు గళం న్యూస్ జనగామ ఏప్రిల్ 16
జనగాం జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వుల మేరకు,పిసిపిఎన్డిటి
చట్టం, 1994 ప్రకారం ఒక స్కాన్ సెంటర్ నమోదు ధృవపత్రాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.డోంగల ప్రాంతానికి చెందిన అసంపల్లి లక్ష్మీ నర్సమ్మ యాజమాన్యంలో నడుస్తున్న (డా. ఎ. స్వప్న అసంపల్లి, డా. డి. మౌనిక ఆధ్వర్యంలో) స్కాన్ సెంటర్‌కు చెందిన పిసిపిఎన్డిటి
నమోదు నెం. 28/డిఇఎంఓ/డిఎంహెచ్ఓ/జెఎన్/2023 ను సెక్షన్ 20(2) కింద విచారణ పూర్తయ్యే వరకు తక్షణ ప్రభావంతో నిలిపివేశారు.ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలుగా అధికారులు పలు లోపాలను గుర్తించారు.ముఖ్యంగా నమోదు ధృవపత్రంలో ఉన్న చిరునామా మరియు ,ఫాలం-ఎ పరికరాల ఇన్వాయిస్లలో ఉన్న చిరునామాలు సరిపోకపోవడం, ఇన్స్పెక్షన్ చెక్‌లిస్ట్‌లో తేదీ, సమయం నమోదు చేయకపోవడం, డిఎల్ఎఎ కమిటీ సమావేశపు నిమిషాలు అందుబాటులో లేకపోవడం, అలాగే బయోమెడికల్ వేస్ట్ సేవా ధృవపత్రం గడువు ముగిసిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.సస్పెన్షన్ కాలంలో గర్భపూర్వ నిర్ధారణ పరీక్షలు నిర్వహించరాదని, అల్ట్రాసౌండ్ పరికరాన్ని పిసిపిఎన్డిటి సంబంధిత విధానాలకు ఉపయోగించరాదని ఆదేశించారు. అలాగే సస్పెండ్ చేసిన ధృవపత్రాన్ని మూడు రోజులలో అప్పగించాలని పేర్కొన్నారు.ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే పిసిపిఎన్డిటి చట్టం సెక్షన్ 23 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ ఉత్తర్వుల ప్రతులను రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డిఎం-హెచ్ఓ జనగాం,పిసిపిఎన్డిటి నోడల్ అధికారి మరియు వరంగల్ పోలీస్ కమిషనర్‌కు పంపించారు.