సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య దంపతుల సేవలు ఆదర్శనీయం
సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య దంపతుల సేవలు ఆదర్శనీయం
తెలుగు గళం న్యూస్ జఫర్ఘడ్ ఏప్రిల్ 28
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం రఘునాథ్‌పల్లి గ్రామంలో మంగళవారం రోజు గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య, ఆయన సతీమణి ఎడ్ల లీలావతితో కలిసి నిర్వహించిన గర్భిణీ స్త్రీల శ్రీమంతం కార్యక్రమం గ్రామ ప్రజల హృదయాలను గెలుచుకుంది. గ్రామంలోని ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఇంత ప్రేమతో, బాధ్యతతో కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయం.అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు చీరలు, గాజులు, పండ్లు, ఐరన్ టాబ్లెట్లు అందజేయడంతో పాటు“సర్పంచ్ కిట్”అందించడం ద్వారా వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీల పట్ల ఆయనకు ఉన్న మానవతా దృక్పథం స్పష్టంగా ప్రతిబింబించింది.ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సురక్షిత ప్రసవాలు జరగాలని సూచిస్తూ, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తన స్వంత వాహనాన్ని పంపిస్తానని, అవసరమైతే ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించడం ఆయన సేవా భావానికి నిదర్శనం. ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండే నాయకుడిగా సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య మరోసారి తన కట్టుబాటును చాటిచెప్పారు.ఎఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు మెరుగైన సేవలు అందించాలని కోరుతూ గ్రామ అభివృద్ధికి తన అంకితభావాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు, గర్భిణీ స్త్రీలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రజల పట్ల ప్రేమ, సేవా తపన కలిగిన నాయకత్వం అంటే ఇదే అన్నట్లు సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య దంపతులు నిలిచారు.