అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్
: ఏబీవీపీ డిమాండ్
తెలుగు గళం న్యూస్ వీరపట్నం, ఏప్రిల్ 28
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శంషాబాద్ విభాగ్ పరిధిలోని వీరపట్నం జిల్లా మలగలపల్లి చౌరస్తాలో విద్యార్థులు బస్సులను నిలిపివేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఏబీవీపీ వీరపట్నం జిల్లా కన్వీనర్ పయ్యంశెట్టి జగదీష్ మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా సుమారు రూ.10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. హైకోర్టు పలు మార్లు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్రపల్లి మహేందర్, ఢిల్లీ భానుప్రసాద్, స్టేట్ టెక్నికల్ సెల్ కో-కన్వీనర్ చింతల గుణవంత్ రెడ్డి, స్టేట్ వనవాసి కో-కన్వీనర్ మునవత్ రాజేష్, ఎస్ఎఫ్ఎస్ స్టేట్ కో-కన్వీనర్ పుప్పాల ఆదర్శ్, స్టేట్ సోషల్ మీడియా కో-కన్వీనర్ వెంకటరమణ, విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ జ్యోతి ప్రసాద్, నగర కార్యదర్శి వినయ్ తదితరులు పాల్గొన్నారు.