-భూక్య చందు నాయక్ తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.
ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపాలపై ఎఐకెఎస్ తీవ్ర ఆగ్రహం
-భూక్య చందు నాయక్
తెలంగాణ రైతు సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శి.
తెలుగు గళం న్యూస్ జనగామ ఏప్రిల్ 28
జిల్లావ్యాప్తంగా ధాన్యం సేకరణ తన గుప్పెట్లో పెట్టుకుని రవాణా కాంట్రాక్టర్, గన్ని బ్యాగుల కాంట్రాక్టర్, మరియు మిల్లర్లకు రావాల్సిన గత సంవత్సరాల బకాయి మిల్లింగ్ బిల్లులో 18 కోట్లను రిలీజ్ చేయపోవడంతో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేయక పోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ విమర్శించారు.జనగామ జిల్లా కలెక్టర్ అనునిత్యం దాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారని స్థానికంగా ఉండే సమస్యలను అర్థం చేసుకోకుండా చట్టాలు అన్ని పనులు చేస్తాయని భావిస్తూ ఉండడం వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సుమారు నెలరోజుల అవుతున్నప్పటికీ నేటికీ రవాణా సౌకర్యం ట్రాన్స్పోర్ట్ పూర్తిస్థాయిలో లారీలు అందుబాటులో లేకపోవడంతో దాన్యం కాంట పూర్తయినప్పటికిని సెంటర్ల వద్ద రోజుల తరబడి నిల్వ ఉండడం వలన గన్ని బ్యాగులు పూర్తిగా చెదలు పట్టిపోతున్నాయని మరియు కాంట పూర్తయిన తర్వాత లిఫ్టింగ్ చేయకపోవడంతో వెయిట్ లాస్ అవుతుందని, జిల్లా కలెక్టర్ వ్యవహార శైలి వలన మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. పొట్టి రకం దాన్యం పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధర తగ్గిస్తున్నారని రైతుల వద్ద డబ్బులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పరిశీలించి సాధారణ రకం ధాన్యాన్ని గుర్తించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య రమావత్ మీట్యా నాయక్ ఆత్కూరు ఎల్లయ్య తాండ్ర ఆనందం పురుషుల కుమార్ రైతులు సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.