
ఈ69న్యూస్ వరంగల్: నగరంలో గాంజా అక్రమ రవాణా మరియు వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, కేసులను సమర్థవంతంగా నమోదు చేసి విచారణలో ప్రావీణ్యత చూపిన ఇంత జార్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.ఎ షుకూర్ను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రశంసించారు.ఈ సందర్భంగా కమిషనర్, ఇన్స్పెక్టర్ ఎం.ఎ షుకూర్కు ప్రశంస పత్రం అందజేశారు. నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణలో ఆయన కృషి ప్రశంసనీయం అని, ఇలాంటి అధికారులు పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు.గాంజా నియంత్రణలో భాగంగా నిరంతరం ప్రత్యేక దాడులు నిర్వహిస్తూ, నేరస్తులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న ఇన్స్పెక్టర్ సేవలను కమిషనర్ అభినందించారు.