బాబూ జగజ్జీవన్రామ్ జయంతి ఘనంగా నిర్వహణ
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో బాబూ జగజ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది బాబూ జగజ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబూ జగజ్జీవన్రామ్ దేశానికి చేసిన సేవలు,సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో:ఎల్ డి సి శ్రీనివాస్,ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.