ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా రాపర్తి రాజు రెండవసారి ఎన్నికఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా రాపర్తి రాజు రెండవసారి ఎన్నిక
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ31 May, 2026E69NEWS

ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా రాపర్తి రాజు రెండవసారి ఎన్నిక

ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా రాపర్తి రాజు రెండవసారి ఎన్నిక

జిల్లా నుండి రాష్ట్ర కమిటీ సభ్యులుగా
బైరగొని బాలరాజు, గజ్వేల్లి రమేష్

మహాసభల జయప్రదానికి సహకరించిన వారందరికీ అభినందనలు జనగామ పట్టణంలో జరిగిన అల్
హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర నాలుగవ మహాసభలలో రాపర్తి రాజు రెండవసారి రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా భైరగొని బాలరాజు గజ్వేల్లి రమేష్ లు ఎన్నికైనారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని సిఐటి యు కార్యాలయంలో రాపర్తి రాజు మాట్లాడుతూ..జనగామ పట్టణంలో జరిగిన ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) మహాసభలు విజయవంతంగా జరిగాయి అని ఈ మహాసభలకు సహకరించిన సిఐటియు రాష్ట్ర జిల్లా నాయకత్వానికి ప్రజా సంఘాల నాయకులకు కార్మికులకు శ్రేయోభిలాషులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు రాపర్తి రాజు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ హమాలి కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పైన రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన 30 జిల్లాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారని చర్చల ఆధారంగా భవిష్యత్ పోరాటాలకు 12 కర్తవ్యాలు అరు తీర్మానాలను మహాసభ ఆమోదించిందని పేర్కొన్నారు.తీర్మానాలకు సంబంధించి 1 కేంద్ర బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను అమలు చేసేందుకు తెచ్చిన నోటిఫికేషన్లను వెంటనే రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోడ్స్ ను అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి.2 రాష్ట్రంలో ఏడు లక్షల హమాలి కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందించాలి.3 కార్మిక వర్గ ఐక్యతను విచ్చినం చేసే మతోన్మాద చర్యలను వ్యతిరేకిస్తూ మతసామరస్యాన్ని కాపాడుకునేందుకు ఉద్యమించాలి.4 కార్మిక పోరాటాల పై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలి ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి.5 రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉన్న అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అమలు చేయాలి.6 సామాజిక ఉద్యమాలకు అండగా నిలబడదాం
ఈ ఆరు తీర్మానాలను మహాసభ ఆమోదించిందన్నారు.భవిష్యత్తులో ఈ తీర్మానాల అమలు కోసం పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ మహాసభలకు సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర నాయకులు హాజరై మహాసభలో హమాలి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఉద్యమాలకు దిశ నిర్దేశం చేస్తూ ప్రసంగించారు.ఈ మహాసభలో 65 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నుకున్నారని జనగామ జిల్లా నుండి ముగ్గురికి ప్రాతినిధ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *