ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానంఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ27 March, 2026E69NEWS

ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం

ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం

ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడిదల వినయ్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు అన్నదానం
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారామపురం గ్రామంలోని ప్రేమ్ సదన్ వృద్ధాశ్రమంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడకండ్ల మండలానికి చెందిన కొడిదల యాదయ్య తన కుమారుడు కొడిదల వినయ్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు మటన్ కూరతో అన్నదానం నిర్వహించారు. కొడిదల వినయ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.
కుమారుడు విదేశాల్లో ఉన్నప్పటికీ, ఆయన పుట్టినరోజును సేవా కార్యక్రమంగా జరపడం ద్వారా యాదయ్య సమాజానికి మంచి సందేశం ఇచ్చారు. వృద్ధాశ్రమంలోని వృద్ధుల పరిస్థితిని గమనించి వారికి ఆహారం అందించడం ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశారు. చెల్లి ప్రణతి తన అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ వారం దాతలు ముందుకు వచ్చి వృద్ధులకు సహాయం అందిస్తున్నారని, వృద్ధులు కూడా తృప్తిగా భోజనం చేస్తూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.
ఫౌండేషన్ తరఫున కొడిదల వినయ్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకొని సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *