సత్తుపల్లి మున్సిపాలిటీ 4 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ (గ్రాండ్) మౌలాలిసత్తుపల్లి మున్సిపాలిటీ 4 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ (గ్రాండ్) మౌలాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ5 February, 2026E69NEWS

సత్తుపల్లి పుర పోరుఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇరిగేషన్ చైర్మన్ మువ్వా,ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి

సత్తుపల్లి మున్సిపాలిటీ 4 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ (గ్రాండ్) మౌలాలి

సత్తుపల్లి,ఆర్ సి,ఫిబ్రవరి05(తెలుగుగళం)న్యూస్: సత్తుపల్లి మున్సిపాలిటీ 4 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ (గ్రాండ్) మౌలాలి,17 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చవ్వా స్వరూపరాణి ల విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఇంటింటి ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఇరిగేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, ఎమ్మెల్యే డా మట్టా రాగమయి దయానంద్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టి.జి. ఐ.డి.సి.చైర్మన్ మువ్వా విజయబాబు ప్రసంగిస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయిన రేషన్ కార్డ్స్, సన్నబియ్యం,ఇందిరమ్మ ఇళ్లు,డ్వాక్రా సంఘాల గురించి వివరించి రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడుతుందని మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేయాలని సూచించారు.రాగమయి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి టౌన్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, 4,17 వ వార్డ్ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా, మట్టా అభిమానులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *