చదువుకున్న పాఠశాలకే ముఖ్య అతిథిగా ముంటిమడుగు కేశవరెడ్డిచదువుకున్న పాఠశాలకే ముఖ్య అతిథిగా ముంటిమడుగు కేశవరెడ్డి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ16 August, 2026E69NEWS

చదువుకున్న పాఠశాలకే ముఖ్య అతిథిగా ముంటిమడుగు కేశవరెడ్డి

చదువుకున్న పాఠశాలకే ముఖ్య అతిథిగా ముంటిమడుగు కేశవరెడ్డి

బిఎస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఘనంగా 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడిసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ముంటిమడుగు కేశవరెడ్డి మాట్లాడుతూ.. “నేను ఇదే పాఠశాల పూర్వ విద్యార్థిని. ఒకప్పుడు విద్యార్థిగా ఉన్న పాఠశాలకు నేడు ముఖ్య అతిథిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో బిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ హైదర్ వలీ , చీఫ్ గెస్ట్ ముంటి మడుగు కేశవరెడ్డి, శివరాం రెడ్డి, గేట్ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *