మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బండ కార్తీక చంద్రారెడ్డిమాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బండ కార్తీక చంద్రారెడ్డి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ15 August, 2026E69NEWS

80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బండ కార్తీక చంద్రారెడ్డి .

మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బండ కార్తీక చంద్రారెడ్డి

దేశభక్తి భావంతో దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బండ కార్తీక చంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు.
నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం జాతీయ గీతాలాపనతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని బండ కార్తీక చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, 2047 నాటికి వికసిత్ భారత్‌ నిర్మాణానికి ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దేశభక్తి నినాదాలు, జాతీయ జెండాలతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.
భారత్ మాతాకీ జై…
వందేమాతరం…!

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *