భద్రాచలం తెలుగు గళం/ న్యూస్ 29 మే 26
భద్రాచలం పట్టణానికి చెందిన మద్దెటి అనూష, వయస్సు. 20 సం రాలు, అను ఆమె ఖమ్మం లోని మమత రోడ్ నందు ఒక బ్యూటిపార్లల్ లొ పని చేస్తుంది. గత 20 రోజుల క్రితం అనూష తన తల్లి గారి ఊరు అయిన భద్రాచలం వచ్చి కొన్ని రోజులు ఉంది తేదీ. 20.05.2026 నా ఖమ్మం వెలుతానని తన తల్లికి చెప్పి ఖమ్మం బయలుదేరి వెళ్ళినది. అప్పటి నుండి ఒక వారం రోజుల వరకు అనూష ఫోన్ కు రెస్పాండ్ కాకపోయేసరికి మద్దెటి లలిత తన కూతురి ఆచూకీ కోసం ఖమ్మం వెళ్లగా అక్కడ తన కూతురు కనిపించకపోయేసరికి లలిత ఖమ్మం హవెలి పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు ఇవ్వగా జీరో FIR కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి భద్రాచలం పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేయగా ఈ రోజు భద్రాచలం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన జి. స్వప్న గారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తప్పిపోయిన వ్యక్తి ఎవరికైనా కనిపించినట్లయితే భద్రాచలం పోలీస్ వారికీ సమాచారం ఇవ్వగలరు.