మర్లపాడు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధిని పి.రుష్మిత
వేంసూరు,మే29(తెలుగు గళం) న్యూస్:
కార్పొరేట్ కళాశాలలలో చేరేందుకై మేధా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ప్రవేశ పోటీలో వేంసూరు మండలం, మర్లపాడు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధిని పి.రుష్మిత ఖమ్మం జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేధా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మార్చినెలలో ప్రతిభ గలిగిన నిరుపేద వర్గాలకు చెందిన బాలికలకు ప్రవేశ పరీక్ష నిర్వహించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించారు.పాల్గొన్న వారిలో మర్లపాడు ఉన్నత పాఠశాల విద్యార్ధిని రుష్మిత జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రుష్మితకు మేధా చారిటబుల్ ట్రస్ట్ ఇంటర్ ఉచిత విద్యను తమకళాశాలలోఅందించి ఎంబిబియస్ లేదా డిగ్రీ వరకు ఏ కార్పొరెట్ కళాశాలలో చేరినప్పటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని సంస్థ భరిస్తుంది.
ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబ వర్గాలకు చెందిన తనను ఎంపిక చేసిన మేధా చారిటబుల్ ట్రస్ట్ కు రుష్మిత కృతజ్ఞతలు తెలిపింది.బైపీసి విభాగం నుండి ఎంబిబియస్.ఉన్నత విద్యను చదవాలనే తన కలను నెరవేరుస్తున్న మేధా చారిటబుల్ ట్రస్ట్ నిజం చేస్తున్నందుకు తాను ఎంతో కృతజ్ఞురాలినని తెలిపింది.
రుష్మిత తండ్రి రాఘవులు మర్లపాడు గ్రామానికిచెందిన వారు.రుష్మిత తన పదవ తరగతివరకు స్థానిక ఉన్నత పాఠశాలలో పూర్తి చేసారు. తనను ఈ స్థాయిలో నిలిపిన తల్లిదండ్రులకు,గురువులకు ధన్యవాదాలు తెలిపింది