సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి కురసం ముత్యాలరావు
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి కురసం ముత్యాలరావు
దమ్మపేట,మే29(తెలుగు గళం) న్యూస్:
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్, ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, దేశ ప్రజలపై పెంచిన నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా దమ్మపేట మండల కార్యదర్శి కురసం ముత్యాలరావు,అఖిలభారత ఐక్య రైతు సంఘం డివిజన్ అధ్యక్షులు పండూరి వీరబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు lనిర్వహించాలని పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా దమ్మపేట మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పండూరి పాల్గొని మాట్లాడుతూ మే 15 నుంచి మే 25 వరకు 10 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు.4 విడతలుగా పెట్రోల్ పై 7 రూపాయల 38 పైసలు, డిజిల్ పై 7 రూపాయల 52 పైసలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాలు మోపిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు, ఇతర ధరలు పెరిగి సామాన్యులు జీవించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం తహశీల్దార్ కి వినతిపత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో: నాయకులు పండూరి వీరబాబు, సోయం లక్ష్మయ్య, కుంజ పాపారావు తదితరులు పాల్గొన్నారు